గత కొంత కాలంగా కస్టమ్స్ అధికారులు అక్రమ గూడ్స్ రవాణా పైన కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లగ్జరీ గడియారాల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. కస్టమ్స్ విభాగం చాలా చాకచక్యంతో వ్యవహరించడంతో ఖరీదైన వాచీలను రవాణా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి నుండి రూ.2.89 కోట్ల విలువ చేసే 33 గడియారాలను సీజ్ చేసారు. దేశ రాజధానిలోని అతి పెద్ద షోరూమ్లు ఎటువంటి దిగుమతి సుంకం చెల్లించకుండా ఈ గడియారాలను దిగుమతి చేస్తున్నట్లు సమాచారం.