టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటించే విషయంపై చంద్రబాబు వెనక్కి తగ్గారు. పార్టీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఈ పదవి ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో ఆ నియామకాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. దీని వెనుక అంతర్గతంగా పెద్ద తతంగమే నడిచిందని పార్టీలో చర్చ జరుగుతోంది.