బీజేపీతో సంబంధం లేకుండా తన సొంత కార్యక్రమాలతో బిజీగా ఉండేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మన నది - మన నుడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేకుడండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఎంపిక చేసిన ఐదు నియోజకవర్గాల్లో క్రియా శీలక సభ్యత్వాలను తీసుకుంటున్నారు. జిల్లాల్లో పార్టీని మరింత పటిష్ట పరచేందుకు కృషి చేస్తున్నారు. బీజేపీతో కలసి పనిచేస్తున్నా.. వచ్చే ఎన్నికలనాటికి జనసేనకు మంచి కేడర్ ఉండాలని ఆలోచిస్తున్నారు పవన్.