నేరస్థుడు ఫిరోజ్ అలీ నాలా సొపారా అనే స్లమ్ ఏరియాలో ఉన్నట్టు పోలీసులకి సమాచారం వచ్చింది. దీంతో లక్నోలోని ఠాకూర్గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ జగదీశ్ ప్రసాద్ పాండే, కానిస్టేబుల్ సంజీవ్ సింగ్లను పంపగా అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేసారు. ఇలా లక్నోకు తీసుకువచ్చేందుకు బయలుదేరగా జాతీయ రహదారి (ఎన్హెచ్ 26) వెళ్తున్నప్పుడు మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా సమీపానికి చేరుకోగానే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.