ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు హేమంత్ నివాసం వద్ద ఈరోజు సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.