గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు జగన్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు జగన్.