చిత్తూరు జిల్లాలో ఓ దళితుడిపై జరిగిన దాడిని రాజకీయం చేయాలని చూసి అడ్డంగా బుక్కైపోయారు చంద్ర బాబు. ఆదివారం చిత్తూరు జిల్లా బి. కొత్తపేటలో రామచంద్ర అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. దాడి వెనక వైసీపీ నేతల హస్తం ఉందని, వారందర్నీ వెంటనే అరెస్ట్ చేయాలంటూ అప్పటికప్పుడు డీజీపీకి లేఖ రాశారు. అయితే ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాలను బయటపెట్టారు. ఈ దాడి చేసింది టీడీపీ నాయకుడేనని దర్యాప్తులో తేలింది.