గతంలో ప్రార్థనా మందిరాలపై జరిగిన దాడులతో పోల్చి చూస్తే ఈ ఏడాదే అతి తక్కువ దాడులు జరిగాయని అంటున్నారు ఏపీ పోలీసులు. గత కొన్నేళ్లతో పోలిస్తే 2020లోనే రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలపై దాడులు తక్కువగా జరిగాయని వివరించారు. 2015లో 290, 2016లో 322, 2017లో 318, 2018లో 267, 2019లో 305, 2020లో 228 ఘటనలు జరిగాయని.. అత్యధికంగా 2016లో 322 ఘటనలు జరిగాయని చెప్పారు.