నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓటమి పాలైన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల రణ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఫిరాయింపులకు అధికార పార్టీ పెద్ద ఎత్తున తెర లేపింది.