స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. పోయినసారి కలెక్టర్ల తీరుపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్, ఈ దఫా జాయింట్ కలెక్టర్లకు తలంటారు. గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారని అన్నారాయన. వారానికి కనీసం నాలుగుసార్లు సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలని గుర్తు చేశారు.