ఏపీ సచివాలయంలో నకిలీ పత్రాలను సృష్టించి ఓ వ్యక్తిని ఉద్యోగం పేరుతో మోసం చేసిన నలుగురిని గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంత్రి కొడాలి నాని పేషీలో ఔట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ యాగయ్య అనే యువకుడి వద్ద ఏకంగా మూడున్నర లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు. ఈ నగదును మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆరుగురు వ్యక్తులు పంచుకున్నారు. చివరకు ఓ నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్ సృష్టించి సదరు యాగయ్యని మోసం చేశారు.