బిస్కెట్లు తయారు చేసేటప్పుడు వేడిగా ఉంటాయి. ఒక వేళ ఆ వేడితోనే కనుక ప్యాకింగ్ చేసేస్తే లోపల ఉన్న వేడి ఆవిరిగా మారిపోతుంది. అలానే క్రీం కరిగిపోయి , బిస్కెట్లు మెత్తబడి పోతాయి. అలానే బిస్కెట్స్ కూడా విరిగి పోతాయి. అదే ఈ రంధ్రాలు ఉంచడం వల్ల గాలి బయటికి వచ్చేసి బిస్కెట్లు మామూలుగా ఉంటాయి. అందుకే ఒక్కో బోర్బొన్ బిస్కెట్ కి 10 రంధ్రాలు వరకు మనకు కనిపిస్తాయి