ఈ నెల 27న జిల్లాలోని ఆగర మంగళం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి, ధ్వంసం చేసిన సంగతి స్థానికంగా సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా SP సెంథిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటన జరిగిన వెంటనే దీని మీద వెంటనే విచారణ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ఎంతో శ్రమ చేసి పట్టుకున్నామని చెప్పారు.