ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. మూడేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలన్నీ మార్చేస్తామంటున్నారాయన. కొత్తగా నిర్మిస్తున్న అన్ని ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దాలని, ఎక్కడా రాజీ పడకుండా మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని, వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడు కార్యక్రమంలో జరిగిన సమీక్షలో సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్ లుక్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు జగన్.