గ్రామ సచివాలయాల్లో తీసుకునే రుసుముల్ని భారీగా పెంచి పేదలపై పెను భారం మోపింది వైసీపీ సర్కార్. ఇప్పటి వరకూ మీసేవా కేంద్రాల్లోనే సంబంధిత సేవలకు సర్వీస్ చార్జి కూడా వసూలు చేస్తారు. ఇప్పుడా పద్ధతిని సచివాలయాల్లో కూడా ప్రవేశ పెట్టారు. దీంతో ఇకపై సచివాలయాలకు వెళ్లి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి జేబులకు చిల్లులు పడటం ఖాయం.