తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల విషయంలో కేసీఆర్ బాగా పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఏపీ తమ జలవనరులన్నిటినీ కొల్లగొడుతోందనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. కేంద్రం కూడా ఏపీకి సహకరిస్తోందని మండిపడుతున్నారు కేసీఆర్. ఈ విషయాలు తేల్చుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్, ఈమేరకు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.