కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం ద్వారా భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోవడానికి సూపర్ స్ప్రెడర్స్ యే కారణమని వెల్లడించారు. సైన్స్ అనే ఒక జర్నల్ లో వారి పరిశోధనలకు సంబంధించిన నివేదికలను పబ్లిష్ చేశారు. అయితే ఈ అధ్యయనంలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తో సహా రెండు భారతదేశ రాష్ట్రాల నుండి పరిశోధకులు పాల్గొన్నారు.