ఇంటర్నెట్లో అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాగా, దేశంలో ఈ తరహా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 4వ స్థానంలో ఉండటం బాధాకరం. ఈ విషయాన్ని స్వయంగా NCRB (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) తాజా నివేదికలో వెల్లడించింది. ఇక గతేడాది 1,629 సైబర్ నేరాలు ఇక్కడ జరిగినట్టు అంచనా.