ఇప్పుడు టీడీపీ ఎంపీలను వైసీపీ టార్గెట్ చేసింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంతో వైసీిపీ నేతలు చేసిన మంతనాల వల్లే జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి టీడీపీని వీడినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ కుమారి తాజాగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామా చేశానని చెబుతున్నా.. పార్టీ విధానాలు నచ్చకే ఆమె బైటకు వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. వైసీపీనుంచి వచ్చిన ఆఫర్ కూడా వారికి నచ్చిందని అందుకే వెంటనే టీడీపీకి రాజీనామా చేశారని అంటున్నారు.