నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చే పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరోసారి వారిని మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 2వేల రూపాయలు పింఛన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. జగన్ వచ్చాక పింఛన్ 3వేలకు పెంచుతామని చెప్పారని, అయితే తెలివిగా తప్పించుకునేందుకు పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతామని చెప్పారని మండిపడ్డారు. ఆడిన మాట తప్పిన జగన్ ఏడాదికి 250 రూపాయలు పింఛన్ పెంచారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చాక 2250 పింఛన్ ఇచ్చారని, అయితే ఏడాది పూర్తయినా మరో 250 రూపాయలు పెంచలేదని మండిపడ్డారు.