‘‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా హాస్టళ్లలో కూడా మెనూ ఉండాలని అధికారులకు సూచించారు జగన్. మన కొడుకు లేదా కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా మన హాస్టళ్లను మార్చాలని చెప్పారు. జగన్ చెప్పిన మాటకు అధికారులే షాకయ్యారు. ఇంతవరకు పిల్లల గురించి ఎవరూ ఇలా మాట్లాడలేదని, కచ్చితంగా హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తామని, ప్రత్యక్షంగా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అధికారులు ఈ సందర్భంగా జగన్ తో చెప్పారు.