ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వైరస్ ను అత్యంత పర్ఫెక్ట్ గా నిర్ధారించే వైద్య పరీక్ష ఆర్టీ పీసీఆర్ అని అందరికీ తెలిసినదే. అయితే, ఈ పరీక్షలో ఫలితం రావాలంటే సాధారణంగా 24 గంటల సమయం పడుతుంది. ఇకపోతే దీనికన్నా తక్కువ సమయంలో కరోనా వ్యాధిని నిర్దారించే ఖచ్చితమైన సరికొత్త కరోనా టెస్టింగ్ కిట్ ను రిలయన్స్ సంస్థకు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసినట్టు చేసింది. ఈ కిట్ కు ఆర్-గ్రీన్ కిట్ గా రిలయన్స్ నామకరణం చేయడం జరిగింది.