గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చిన స్వచ్ఛ అవార్డులలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కింది. తెలంగాణ సర్కార్ ఆ అవార్డును స్వీకరించే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. తన పత్రిక నమస్తే తెలంగాణను పక్కన పెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా తెలంగాణ సర్కార్ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. కానీ జగన్కు సంబంధించిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనలు ఇవ్వకపోవడం గమనార్హం.