ఈ ఏడాది చివరి వరకు హెచ్-1బీ వీసాలను మంజూరు చేయకుండా ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం చట్టసభ అయిన కాంగ్రెస్కు తప్ప అధ్యక్షునికి లేదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు మహారాజులాగా వ్యవహరించకూడదని, ఆ అధికారాలపై పరిమితులు ఉండాలని పేర్కొంది.