హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్తాంగ్లో ఉన్న ప్రపంచం లోనే అతి పొడవైన అటల్ టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో దీనిని రూపొందించడం జరిగింది. 9.02 కిలో మీటర్ల పొడవుగా నిర్మించారు. సొరంగం కారణంగా మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలో మీటర్ల దూరం తగ్గుతాయి.