ఆస్తుల వివరాలు నమోదు చేయకుంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వివరాల సేకరణకు ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఇళ్ల వద్దకు వస్తే ప్రమాదవశాత్తు కరోనా రావచ్చు అని భయంతో ఉన్నారు. అలానే వీళ్ళు ఇంటికి వస్తే...ప్రజల భయం కూడా మరో వైపు ఉంటుంది. అందుకే ఇటువంటి సమస్యలు కలుగకుండా ఉండాలని ఆస్తుల వివరాలను యజమానులే అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం.