అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పై స్పష్టతనిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు త్వరగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండూ తమకు ముఖ్యమేనన్నారు. సమస్యలు పరిష్కారం అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.