ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. సీబీఐతో విచారణ జరిపితే చంద్రబాబు లొసుగులన్నీ బైటపడతాయని, కేంద్రం జోక్యం చేసుకుంటే విచారణకు వంకలు పెట్టేందుకు కూడా టీడీపీ నేతలు వెనకాడతారని అంచనా వేశారు. అయితే కేంద్రం ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీని కలసి సీబీఐ ఎంక్వయిరీపై మరోసారి జగన్ మాట్లాడతారని అంటున్నారు.