ఇప్పుడు ఆధార్ కార్డు ఎంతో చిన్నగా వచ్చింది. అచ్చం డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణం లోకి ఆధార్ మారిపోయింది. పాలి వినైల్ క్లోరైడ్ (పీవీసీ)తో దీనిని రూపొందించడం జరిగింది. ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ కార్డుని కనుక మీరు తీసుకోవాలని భావిస్తే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి తమ ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను ఎంతో సులువుగా పొందొచ్చు.