ఏపీలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల అధికారాలకు పూర్తిస్థాయిలో కత్తెర వేశారు సీఎం జగన్. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు ఆందోళనబాట పట్టారు. తమ హక్కుల సాధనకోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తమకు బయోమెట్రిక్ హాజరు తీసేయాలని, ఎమ్మార్వోల ఆధ్వర్యంలోనే తాము విధులు నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.