గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మధ్య వచ్చిన విభేదాలపై సీఎం జగన్ స్పందించారని తెలుస్తోంది. వంశీకి సీఎం జగన్ ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, సర్దుకు పోవాలని సూచించినట్టు వార్తలొస్తున్నాయి. అయితే జగన్ నేరుగా ఇలాంటి విషయాలలో కలుగజేసుకోరని, పార్టీ పెద్దలకు చెప్పి పరిష్కారం చేయాలని సూచిస్తారని మరికొందరి వాదన. ఏది ఏమైనా.. టీడీపీ ఎమ్మెల్యేల చేరికలతో వైసీపీలో విభేదాలు మొదలైనట్టు స్పష్టమవుతోంది.