మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మహానేత వైఎస్సార్.. అది మరిచిపోయి సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని అమర్ నాథ్ హెచ్చరించారు. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హెచ్చరించారు.