రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు.. ప్రత్యర్థులపైనే కాదు.. సొంత పార్టీలో.. సొంత నేతలపై కూడా ఉంటాయి. నియోజకవర్గాలు, జిల్లాలపై పైచేయి సాధించాలనుకునే నాయకులు ఈ తరహా వ్యూహాలతో సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఇప్పడు చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజాకు ఎదురైందని నియోజకవర్గం ప్రజలు గుసగుసలాడుతున్నారు. రోజా జబర్దస్త్.. విషయం అందరికీ తెలిసిందే. ఆమె నోరు విప్పితే.. నిప్పులు కురుస్తాయి. ప్రతిపక్షంపైన, ముఖ్యంగా ప్రత్యర్థిపార్టీల నాయకులు.. చంద్రబాబు పవన్‌లపై ఆమె ఏం రేంజ్లో విరుచుకుపడాతారో తెలిసిందే.