రాష్ట్రంలో టీడీపీకి చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గతం తాలూకు పరిస్థితులను అంచనా వేసుకోవడం అనే సూత్రాన్ని తానే పాటించి.. తానే వదిలి వేస్తున్న పరిస్థితి తెరమీదికి వచ్చింది. గతంలో పార్టీలో ఏదైనా పొరపాటు జరిగినా.. పార్టీ ఓటమి పాలైనా.. గతంలో చేసిన తప్పులు .. వాటిపై చర్చలు.. ఉండేవి. సీనియర్ల సూచనలు పాటించి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ వ్యూహాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గతంపై అంతర్మథనమే లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి.