ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు టీడీపీలో మంచి గుర్తింపు లభించిందా? ఆయనను బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌గా నియమించడం పార్టీకి కలిసొస్తుందా? అంటే..ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం పరుచూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా గెలుపు గుర్రం ఎక్కిన ఏలూరి.. పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు. వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో దగ్గుబాటి కుటుంబానికి ఒకప్పుడు బలం ఉండేది. అయితే, ఏలూరి రాకతో ఇక్కడ ప్రజా నాడిని వ్యక్తిగతంగా తనవైపునకు, పార్టీ వైపునకు కూడా తిప్పగలిగారు.