ఇటీవలే జేపీ నడ్డా అధ్వర్యంలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యవర్గం చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని నేతల మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా నలుగురికి చోటు కల్పించారు. ఇదే సమయంలో సీనియర్ నేతలైన మరో ముగ్గురిని తప్పించారు. నిజానికి నలుగురికి చోటు కల్పించినా ముగ్గురిని తప్పించినా బీజేపీ బలం పెరిగిపోయేది లేదు అదే సమయంలో తగ్గిపోయేదీ లేదు. కాకపోతే పార్టీ వాయిస్‌ను చాలా గట్టిగా వినిపిస్తున్న ముగ్గురిని ఒకేసారి జాతీయ కార్యవర్గం నుండి తప్పించటమే ఆశ్చర్యంగా ఉంది.