ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుందనికంటే బూతుల యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. ఇటీవల మంత్రి కొడాలి నాని, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే ఆ రగడ ఇప్పుడిప్పుడే చల్లారుతుందనే లోపే శ్రీకాకుళంకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ అమరావతి రైతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి రచ్చకు కారణమయ్యారు. ఇక మంత్రి మాటలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా అదుపు తప్పి విమర్శలు చేస్తున్నారు.