వైసీపీ ఎన్డీఏలో చేరితే సీనియర్ నేత విజయసాయిరెడ్డికి కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కే అవకాశం ఉంది. మరో రెండు సహాయమంత్రి పదవులు కూడా రావొచ్చని అంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో చేరితే ఏపీలో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే చంద్రబాబుకు మాత్రం పెనుసవాలే ఎదురవుతుంది. వైసీపీ, బీజేపీ స్నేహం.. టీడీపీకి పెద్ద శాపం అనే చెప్పాలి.