దేశవ్యాప్తంగా ఆరోగ్యబీమా అమలులో ఏపీ తొలి స్థానం దక్కించుకుంది. తెలంగాణ ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతంలో 76.1 శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా బీమా సౌకర్యం పొందుతున్నారు. ఏపీ పట్టణ ప్రాంత ప్రజల్లో 55.9 శాతం మంది ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నారు. దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం మందికి ఎలాంటి బీమా సౌకర్యం లేదు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 80. 9 శాతం మందికి బీమా సౌకర్యం లేదు.