దేశవ్యాప్తంగా పోలీసులపై నమోదైన కేసుల్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయంటూ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక వివాదానికి దారితీసింది. గతేడాది దేశం మొత్తం మీద పోలీసులపై 4,068 కేసులు నమోదవగా.. అందులో 1,681 ఏపీలోనే రికార్డయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. 2018లో నమోదైన 97 కేసులతో పోలిస్తే ఏపీలో ఈ తరహా కేసులు 1,584 పెరిగినట్లు వెల్లడించింది.