గత 70 ఏండ్లలో జరగని గ్రామాల అభివృద్ధిని కేవలం సీఎం కేసీఆర్ 6 ఏళ్ళ పాలనలో పల్లెప్రగతి పథకంతో చేసి చూపించారని పరకాల ఎమ్మెల్యే అయినటువంటి చల్లా ధర్మా రెడ్డి అన్నారు. గీసుగొండ మండలం, గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణ మండలంలోని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పై విధంగా స్పందించారు.