రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై గడిచిన రెండు మూడు వారాలుగా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, వీరి విషయంలో కేంద్రం ఎలాంటి ధోరణి అనుసరిస్తుంది ? ఎవరి విషయంలో సానుకూలంగా ఉంటుంది ? ఎవరి విషయంలో ఖరాఖండీగా వ్యవహరిస్తుంది? అనే చర్చ జోరుగానే సాగింది. మొత్తానికి ఈ సమావేశం ముగిసింది.