2019 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఓ వైపు ఘోర ఓటమితో పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. మరోవైపు కొందరు నేతలు వరుసపెట్టి అధికార వైసీపీలోకి, బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇంకా జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల దెబ్బకు టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేని స్థితికి వెళ్లిపోయింది. పైగా కరోనా సమయంలో బాబు హైదరాబాద్‌కే పరిమితమైపోయారు. దీంతో ఏపీలో పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.