2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న సరైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది పార్లమెంటరీ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించడం. ఇలా నియమించడం వల్ల పార్టీకి లాభం జరిగిందో లేదో తెలియదుగానీ నష్టమైతే జరగలేదనే చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన నాయకులు వరుస పెట్టి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఈ వలసల కార్యక్రమం జరుగుతూనే ఉంది. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకు షాక్ ఇచ్చేశారు.