కృష్ణా జిల్లా రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గన్నవరం నియోజకవర్గమే. 2019 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, ఊహించని రాజకీయం చేశారు. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలు రావడంతో వంశీ అసలు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. అలాగే చంద్రబాబుకు మెసేజ్ కూడా పంపారు. బాబు కూడా వంశీకి ధైర్యం చెప్పారు.