వైసీపీలో గంటా శ్రీనివాస్ చేరికను ఇద్దరు స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. జగన్ దగ్గర మాట చెల్లుబాటు అయ్యే ఓ నాయకుడి అండతో అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారట. అయితే అదే జగన్ దగ్గర పలుకుబడి ఉన్న మరో ముఖ్య నాయకుడి అండతో గంటా వైసీపీలో చేరాలనుకుంటున్నారు. గంటా చేరిక లేటవుతుందేమోకానీ.. చేరడం మాత్రం పక్కా అని ఉత్తరాంధ్ర నాయకులంటున్నారు.