ప్రతిపక్ష టీడీపీలో బలమైన వాయిస్ వినిపించే నాయకుల్లో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత శ్రీకాకుళం జిల్లా టీడీపీని ముందు ఉండి నడిపిస్తున్న అచ్చెన్న 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైతే అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిచి, అటు అసెంబ్లీలో, ఇటు మీడియా ముందు గానీ దూకుడుగా ఉంటూ అధికార వైసీపీపై పోరాడారు.