ఒకే విమర్శని పదే పదే చేయడం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బాగా అలవాటు అనే సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్ధులని వీక్ చేయడానికి బాబు చేసిన విమర్శనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఇక బాబు రూట్లోనే టీడీపీ నేతలు కూడా నడుస్తుంటారు. అయితే ఇదంతా ఓల్డ్ ఫార్ములా. ఒకప్పుడు ఇలా పదే పదే ఒకే విమర్శ చేయడం వల్ల ప్రత్యర్ధులకు ఇబ్బందయ్యేది గానీ, ఇప్పుడు మాత్రం సానుభూతి పెరిగి బెన్ఫిట్ అవుతుంది.