టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయంతో, రాష్ట్ర టీడీపీ కేడర్లో ఫుల్ జోష్ వచ్చిందనే చెప్పొచ్చు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించడం వల్ల, టీడీపీ కేడర్ యాక్టివ్ అయింది. అయితే ఈ కొత్త అధ్యక్షులు పార్టీని ఏ మేరకు విజయవంతంగా నడిపిస్తారు? ఎంతవరకు వైసీపీ ధీటుగా టీడీపీని నిలబెడతారనే విషయాలు రాను రాను తెలుస్తోంది. అయితే నాయకుల కెపాసిటీని బట్టి కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.