కొంతకాలంగా హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు బుధవారం సాయంత్రం ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం కరోనా భయం తగ్గిపోవడంతో చంద్రబాబు ఏపీకి తిరిగి వచ్చేశారని, ఇకపై ఇక్కడే ఉంటారని అంటున్నారు. అయితే చంద్రబాబు అమరావతి ఆందోళనలకు మద్దతు తెలిపేందుకే ఏపీకి వచ్చారని కూడా అంటున్నారు.